Tue Jul 15 2025 16:47:13 GMT+0000 (Coordinated Universal Time)
అర్ధరాత్రి రోడ్డుపై బర్త్ డే వేడుకలు.. పోలీసులిచ్చిన గిఫ్ట్ ఏమిటంటే?
హైదరాబాద్ లో అర్థరాత్రిళ్ళు రోడ్లపై బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు.

హైదరాబాద్ లో అర్థరాత్రిళ్ళు రోడ్లపై బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. సదరు బర్త్ డే బాయ్ ను రోడ్డు మీదకు తీసుకుని వచ్చి, కేక్ కట్ చేయడాలు, టపాసులు పేల్చడాలు లాంటివి చేస్తున్నారు. ఇవి చాలా మందికి న్యూసెన్స్ గా మారుతోంది.
తాజాగా ఉప్పల్ల్లో అర్థరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బర్త్ డే హంగామాలో చేసే పనుల వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మద్యం మత్తులో చేసే బైక్ స్టంట్స్ పలువురి ప్రాణాలు కూడా తీశాయి.
Next Story