Fri Dec 05 2025 22:44:41 GMT+0000 (Coordinated Universal Time)
చేప ప్రసాదం ఇచ్చే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
చేపమందు ప్రసాదంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయ్యారు బత్తిని సోదరులు

చేపమందు ప్రసాదంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయ్యారు బత్తిని సోదరులు. వారిలో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ చనిపోయారు. ఈ విషయం ఆయన కుటుంబంలోనూ, సన్నిహితుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పరిస్థితి విషమించి హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
బుధవారం రాత్రి పరిస్థితి విషమించి హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల చేపమందు పంపిణీ సమయంలో ఆయన వీల్‌చైర్‌లోనే అక్కడకు వచ్చారు. పలువురు ఆయనను పరామర్శించారు. బత్తిన కుటుంబం.. ప్రతీఏటా మృగశిరకార్తెరోజు ఉబ్బసం రోగులకు చేపమందు పంపిణీ చేస్తూ ఉంటుంది. గత 173 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఈ చేపమందు ఇస్తూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని బత్తిన సోదరులు కూడా కొనసాగించారు. బత్తిని హరినాథ్‌గౌడ్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.
Next Story

