Tue Mar 24 2026 07:39:25 GMT+0530 (India Standard Time)
Balapur Laddu : రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ ధర
బాలాపూర్ లడ్డూ ధర వేలంలో రికార్డు స్థాయికి చేరుకుంది. ఈసారి 35 లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ సొంతం చేసుకున్నారు

బాలాపూర్ లడ్డూ ధర వేలంలో రికార్డు స్థాయికి చేరుకుంది. ఈసారి 35 లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ సొంతం చేసుకున్నారు. తాజాగా జరిగిన వేలంపాటలో ఆయన బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐదు లక్షల రూపాయల ఎక్కువ ధర పలకడం విశేషం. 1980లో బాలాపూర్ గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ప్రారంభించారు. ఈ ఏడాది వేలం పాటలో 38 మంది పాల్గొన్నారు.
1994లో ప్రారంభమై...
1994లో తొలిసారి బాలాపూర్ లడ్డూను వేలం వేశారు. మొదటి ఏడాది 450 రూపాయలకు వేలం పాట పాడగా, 2002లో 1,05,000 పలికింది. గత ఏడాది లోడ్డూ 30,01,000 రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. ఏటా జరిగే వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలుకగా.. ఈ ఏడాది అంతకు మించి ఐదు లక్షలు పెరిగి ముప్ఫయి ఐదు లక్షల రూపాయలకు లింగాల దశరథ గౌడ్ సొంతం చేసుకున్నారు.
Next Story

