బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేది ఎన్నడో?
మియాపూర్ నుండి బొల్లారం వరకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడానికి

మియాపూర్ నుండి బొల్లారం వరకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడానికిహైదరాబాద్‌లోని బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. పరిపాలనాపరమైన అడ్డంకులు, యుటిలిటీ బదిలీ, నిధుల కొరత కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లి ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడానికి ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి చాలా సమయమే తీసుకునేలా ఉంది.
రూ. 3.97కోట్లలతో ప్రారంభించిన బాచుపల్లి ఫ్లైఓవర్ గత రెండు సంవత్సరాలకు పైగా పరిపాలనాపరమైన అడ్డంకులు, యుటిలిటీ బదిలీ, నిధుల కొరత కారణంగా నిర్మాణం నత్త నడకన సాగుతు వస్తుంది, అయితే ఈమధ్య కొంతమేర వేగం అందుకున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు, కానీ వచ్చే వర్షా కాలం, ఇప్పటికే అద్వానంగా తాయారైనా రోడ్లతో బాచుపల్లి, మల్లంపేట్, నిజాంపేట్ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు, నిత్యం గుంతల రోడ్లలో ప్రయాణం నరకమే!! దీనికి సొల్యూషన్ అయినా
బాచుపల్లి ఫ్లైఓవర్ త్వరగా కంప్లీట్ చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

