Fri Jun 20 2025 02:09:18 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad Fire Accident : అక్రమ కరెంటు పదిహేడు మంది ఉసురు తీసిందా?
చార్మినార్ వద్ద ఆదివారం జరిగిన అగ్నిప్రమాదానికి కారణం అక్రమ విద్యుత్తు వాడకం అని అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

చార్మినార్ వద్ద ఆదివారం జరిగిన అగ్నిప్రమాదానికి కారణం అక్రమ విద్యుత్తు వాడకం అని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఇది ప్రాధమికంగా అధికారులు నిర్ణయించారు. పెరల్స్ దుకాణం రాత్రి మూసి వేసిన తర్వాత బయట విద్యుత్తు స్తంభం నుంచి నేరుగా కరెంట్ ను ప్రహ్లాద్ మోదీ కుటుంబం తీసుకుంటున్నారని అధికారులు గమనించారు. పాతబస్తీలో అక్రమ విద్యుత్తు ను వినియోగించడం మామూలే. పీక్ అవర్స్ లో ఎక్కువ కరెంట్ వినియోగం అవుతుందని భావించి నేరుగా విద్యుత్తు లైన్ నుంచి కరెంట్ ను అక్రమంగా తీసుకుని వినియోగించడం అలవాటు. ఆ అలవాటు ప్లహ్లాద్ మోదీ కుటుంబంలోని మూడు తరాలకు చెందిన పదిహేడు మంది మృత్యువాత పడటానికి కారణమయింది.
షాపు మూసిన తర్వాత...
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటనలో మరణించిన వారంతా బెంగాల్ వాసులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు నలుగుు మహిళలున్నారు. గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మరణించగా, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. బంధువులు ఇళ్లకు సెలవులకు వచ్చి అగ్నికి ఆహుతి అయ్యారు.ముత్యాల వ్యాపారం చేస్తున్న తమ బంధువుల షాపు పైన నివాసం ఉండటంతో హాలులోనే ముప్ఫయి మంది పడుకున్నారు. కింద దుకాణం, పైన నివాసం ఉండటంతో అందరూ ఒకే హాలులో పడుకుని ఉండటంతో ఉదయం నుంచి ఏసీలు నడుస్తూనే ఉన్నాయి.
దశాబ్దాల క్రితం...
దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం ప్లహ్లాద్ మోదీ తండ్రి హైదరాబాద్ కు గుజరాత్ నుంచి వలస వచ్చారు. ఇక్కడ ముత్యాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి తర్వాత కుమారులు కలసి ఉమ్మడి కుటుంబంగా ఉండి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఏసీ ఉదయం నుంచి నడుస్తుండటంతో పాటు బయట విద్యుత్తు స్థంభం నుంచి రాత్రి కరెంట్ ను తీసుకోవడం వల్ల షార్ట్ సర్క్చూట్ జరిగి పక్కనే ఉన్న చెక్కలకు మంటలు అంటుకున్నాయని ప్రాధమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై నాలుగు శాఖల అధికారులు విచారణ చేస్తున్నారు. విద్యుత్తు శాఖ, హైడ్రా, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విచారణ చేపట్టారు. అక్రమ విద్యుత్తు వినియోగం వల్లనే పదిహేడు మంది మరణించారని చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story