Thu Mar 19 2026 17:03:03 GMT+0530 (India Standard Time)
కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్
హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలను ఐదు రోజుల పాటు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలను ఐదు రోజుల పాటు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు వైపు ప్రయాణించే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నిర్వహణ పనుల నిమిత్తం వంతెనపై రాకపోకలను నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఐదు రోజుల పాటు...
6వ తేదీ నుంచి పదో తేదీ వరకూ రాకపోకలపై నిషేధం విధించారు. పోలీసులు ట్రాఫిక్ ను అక్కడి నుంచి ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి మెయిన్టెనెన్స్ లో భాగంగా ఐదు రోజుల పాటు బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఎవరూ ఇటువైపు రావద్దని ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
Next Story

