Wed Jan 21 2026 02:02:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఆశావర్కర్లు చలో హైదరాబాద్
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్న ఆశావర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్న ఆశావర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. తమ డిమాండ్లను సత్వరం పరిష్కరించాలని వారు ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చారు. తమకు పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్లు ఇవే...
అలాగే యాభై లక్షల మేరకు బీమా సౌకర్యం కల్పించాలని, మరణిస్తే యాభై వేల రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. వీటితో పాటు పదోన్నతులు కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని కోరుతూ వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యగా ఆశావర్కర్లను అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు తెల్లవారు జామునుంచే అరెస్ట్ లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోనికి రాకుండా ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారు.
Next Story

