Fri Apr 03 2026 18:31:01 GMT+0530 (India Standard Time)
Hyderabad : టోల్ ప్లాజాల వద్ద యమరద్దీ
వరస సెలవులు ముగియడంతో హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో జాతీయ రహదారి కిటకిటలాడిపోతుంది

వరస సెలవులు ముగియడంతో హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో జాతీయ రహదారి కిటకిటలాడిపోతుంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో పాటు రాఖీ పౌర్ణమి కోసం సొంత ప్రాంతాలకు వెళ్లిన వారు నేటి నుంచి విధుల్లో చేరేందుకు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ప్రధానంగా విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
తిరుగు ప్రయాణాలతో....
అలాగే హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - కరీంనగర్ జాతీయ రహదారులపై కూడా వాహనాల రద్దీ పెరిగింది. ముఖ్యంగా టోల్‌ప్లాజా దగ్గర రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వైపునకు వచ్చే ఎక్కువ మార్గాలను తెరిచి ఉంచారు. ఫాస్టాగ్ అయినప్పటికీ వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.మూడు రోజుల వరుస సెలవుల తర్వాత హైదరాబాద్‌కు ప్రజల తిరుగుప్రయాణాలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
Next Story

