Wed Jan 21 2026 13:28:29 GMT+0000 (Coordinated Universal Time)
మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా జనరేటర్ లో చక్కెర పోసి దానిని ఆఫ్ చేసి తమను చంపేందుకు ప్రయత్నించారని మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నేడు మోహన్ బాబు భార్య నిర్మల పహాడీ షరీఫ్ సీఐకి లేఖ రాశారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో అంతా అబద్ధాలే ఉన్నాయని తెలిపారు.

నిర్మల లేఖలో...
తన పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు కేక్ తెచ్చారని ఆమె తెలిపారు. మనోజ్ చెబుతున్నట్లు విష్ణు ఎలాంటి దౌర్జన్యానికి దిగలేదని ఆమె సీఐకి ిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు అంతా అబద్ధమన్న ఆమె తమ నివాసంలో అటువంటి విష్ణు ఎలాంటి దౌర్జన్యానికి దిగలేదని నిర్మల సీఐకి రాసిన లేఖలో తెలిపారు.
Next Story

