Sat Mar 07 2026 22:44:41 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు
ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు.

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కురానున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబుకు పెద్దయెత్తున ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ర్యాలీగా బయలుదేరి...
జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 65లోని చంద్రబాబు నివాసం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకూ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ సందర్భంగా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

