Wed Mar 25 2026 10:38:15 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు చంద్రబాబు హైదరాబాద్ రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ రానున్నారు. జూబ్లీహిల్స్ లోని ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనహైదరాబాద్ రానున్నారు. కేవలం ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకే హైదరాబాద్ చంద్రబాబు వస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి ఆయన మధ్యాహ్నం 1.30 గంటకు అమరావతికి బయలుదేరి వెళతారు.
శనివారం పార్టీ కార్యాలయంలో...
శనివారం చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వారి నుంచి వినతులను స్వీకరిస్తారు. అయితే ఈరోజు హైదరాబాద్ వెళుతుండటంతో ఆయన పార్టీ కార్యాలయానికి వస్తారా? రారా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది. పార్టీ కార్యాలయంలో మాత్రం చంద్రబాబు రానున్నారని చెబుతున్నారు.
Next Story

