Sat Mar 07 2026 18:14:47 GMT+0530 (India Standard Time)
ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు.

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. కాసేపట్లో అది పేలిపోతుందంటూ ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్కాడ్ తో తనిఖీలను ముమ్మరం చేశారు. ఒకవైపు ప్రజా భవన్ లో గాలింపు చర్యలు చేపడుతూనే మరొక వైపు కాల్ చేసిన ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు.
మల్లు భట్టి విక్రమార్క నివాసముండే....
ప్రజాభవన్ లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసముంటున్నారు. గతంలో కేసీఆర్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడి నుంచే పాలన చేసేవారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిని తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చారు. మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. బాంబు స్క్కాడ్ తనిఖీలను చేస్తుంది. పూర్తి సమాచాం తెలియాల్సి ఉంది.
Next Story

