Wed Dec 10 2025 03:40:37 GMT+0000 (Coordinated Universal Time)
Hyderbad : నిండుకుండలా మారిన నగర జలాశయాలు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని అన్ని జలాశాయాలు పూర్తిగా నిండిపోయాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని అన్ని జలాశాయాలు పూర్తిగా నిండిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు, హైదరాబాద్ లో పడుతున్న వానతో అన్ని జలాశాయాలకు నీళ్లు నిండిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హియాయత్ సాగర్ తో పాటు అన్ని జలాశాయాలు నిండిపోయాయి. దీంతో కొన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. వినాయక్ సాగర్ లో సామర్థ్యానికి మించిన నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
నీరు నిండటంతో...
ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1789.30 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా, 1763.15 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈరోజు కూడా భారీ వర్షాలు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story

