Fri Dec 05 2025 16:52:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు సెప్టంబరు 17న అన్ని పార్టీలు తలో రకంగా?
తెలంగాణలో నేడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విమోచన, విలీనం, సమైక్యతా దినాన్ని పాటించనున్నాయి

తెలంగాణలో నేడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విమోచన, విలీనం, సమైక్యతా దినాన్ని పాటించనున్నాయి. విమోచనం దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో బీజేపీ ఇందులో పాల్గొననుంది. విలీనం పేరుతో కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు పాల్గొననున్నాయి. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో బీఆర్ఎస్ ఈరోజు కార్యక్రమానలను నిర్వహిస్తుంది. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం అయిన సందర్భంలో వివిధ పార్టీలు అనేక పేర్లతో వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటయిన తర్వాత...
తెలంగాణ ఏర్పాటయిన నాటి నుంచి బీజేపీ సెప్టంబరు 17న అధికారికంగా విలీన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. రెండేళ్ల నుంచి అధికారికంగానే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలన్ని నిర్వహిస్తుంది. కానీ నాటి బీఆర్ఎస్ అంగీకరించలేదు. జాతీయ సమైక్యతదినోత్సవంగానే అది కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విలీనం దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మూడు పార్టీలు మూడు దారుల్లో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
Next Story

