Sat Dec 13 2025 19:31:36 GMT+0000 (Coordinated Universal Time)
Akbaruddin Owaisi ఫ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఎంఐఎం పరిస్థితి ఏంటి?
ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన బలమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు నూరుద్దీన్ కు అప్పగించాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతుంది. ఇటీవల ఆయన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఆరోగ్య కారణాల రీత్యానే రాజకీయాల నుంచి ఆయన తప్పుకుని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన తన కుమారుడు నురద్దీన్ ఒవైసీని తన వెంట తిప్పుకుంటున్నారు. అతనికే రాజకీయ వారసత్వ బాధ్యతలను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరుసార్లు గెలిచి...
వచ్చే ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట నుంచి నురుద్దీన్ ఒవైసీని పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానానికి ఆయన బ్యాకప్ నామినీగా ఉన్నాడు.అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంచి నాయకుడిగా పేరుంది. అసెంబ్లీలో, బయట ఆయన ప్రసంగాలకు పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే 2011లో అక్బరుద్దీన్ ఒవైసీపై జరిగిన దాడి తర్వాత ఆయనకు తరచూ ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శరీరంలో ఉన్నబుల్లెట్ అలాగే ఉంది. దీంతో ఆయన తరచూ ఆసుపత్రులకు వెళ్లి ఆరోగ్య పరీక్షలతోపాటు చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది.
ఆరోగ్యపరమైన ఇబ్బందులు..
2011 ఏప్రిల్ 30న బర్కాస్‌లో కత్తులు, తుపాకులతో దాడిచేసిన దుండగులు అక్బరుద్దీన్‌కు తీవ్ర గాయాలు చేశారు. కడుపు, చేతికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. చాలావాటిని వైద్యులు తొలగించినా, ఒక బుల్లెట్ కీలక అవయవాల దగ్గర ఇరుక్కుపోవడంతో అలాగే ఉంచాల్సివచ్చింది. అప్పటి నుంచి ఆయనకు నిరంతర నొప్పి, ఆరోగ్య సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ మేరకు క్యాడర్ తో పాటు పార్టీ నేతలకు కూడా బలమైన సంకేతాలు అందచేశారు. ఆయన కుమారుడు నురుద్దీన్ ఒవైసీకి రాజకీయ బాధ్యతలను అప్పగించనున్నారు.
Next Story

