Thu Mar 05 2026 18:44:17 GMT+0530 (India Standard Time)
Hyderabad : టోలీచౌకిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.హైదరాబాద్ లోని టోలి చౌకిలోని ఒక భవనం నిర్మాణంలో ఉంగా ఒక్కసారి ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్నభవనం నుంచి జారి పడి ముగ్గురు కార్మికులు మరణించారు. భవనం ఐదో అంతస్తులో పనిచేస్తుండగా నిర్మాణం కోసం ఉపయోగించిన సజ్జ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఏడంతస్తుల భవాన్నినిర్మిస్తున్న యజమాని రైలింగ్ ఎలివేషన్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.
నిర్మాణంలో ఉన్నభవనం...
వెంటనే సమాచారంఅందుకున్న సహాయక బృందాలు సంఘటన స్థలికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే భవన నిర్మాణంలో తగిన జాగ్రత్తలు ఇంటి యజమాని తీసుకోక పోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని కార్మికుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.మృతి చెందిన కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

