Sun Mar 15 2026 16:06:41 GMT+0530 (India Standard Time)
Telangana : ఏసీబీ సోదాలు.. వారి ఇళ్లలోనూ
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. హైకోర్టులో ఈ ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్ కొట్టి వేసిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.హైదరాబాద్ లో మొత్తం పది చోట్ల ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలను నిర్వహిస్తున్నారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో....
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ2గా అరవింద్ కుమార్ ఉన్నారు. ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వారి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఈడీ విచారణకు అరవింద్ కుమార్ ఈ కేసులో హాజరవుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారుల ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కీలక డాక్యుమెంట్ల కోసం సోదాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

