Wed Mar 18 2026 22:44:54 GMT+0530 (India Standard Time)
జూ పార్కులో సింహం పిల్ల మృతి
హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో సింహం మృతి చెందింది. దీని వయసు 5.5 నెలలు.

హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో సింహం మృతి చెందింది. దీని వయసు 5.5 నెలలు. దీనికి సింబాగా జూ అధికారులు నామకరణం చేశారు. ఆ సింహం పుల్లి మృతికి అనేక కారణాలు ఉన్నాయని జూ అధికారులు చెబుతున్నారు. తల్లి సింహం పిల్లను దగ్గరకు తీయకపోవడం ఒక కారణం కాగా, ఇతర అనారోగ్య సమస్యలు కూడా మరో కారణమని చెబుతున్నారు.
అనారోగ్యంతోనే....
సింహం పిల్ల తీవ్ర జర్వంతో నిన్న అస్వస్థతకు గురయింది. లంగ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి కారణాలు కూడా ఉండవచ్చని అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప సింహం పిల్ల మరణానికి కారణాలు స్పష్టంగా తెలియవని జూ అధికారులు చెబుతున్నారు.
Next Story

