Mon Jan 05 2026 04:30:24 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : హైదరాబాద్ లో భర్తను కడ తేర్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడిని భార్య ప్రియుడితో కలసి చంపేసింది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడిని భార్య ప్రియుడితో కలసి చంపేసింది. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. ఇటీవల కాలంలో భార్యలు వరసగా భర్తలను ప్రియుడితో కలసి హతమార్చడం తరచూ ఘటనలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలే ప్రాణాలు తీస్తున్నాయి. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన నారాయణ బెహరా, బంధిత బెహరా లు వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వారు వివాహం చేసుకున్నారు.
ఆరేళ్ల కుమార్తె ఉండి....
వీరికి ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ప్లంబర్ పనులు చేసుకుంటూ ఓల్డ్ మీర్ పేట్ లోని శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. ఆమె ఒక కంపెనీలో స్వీపర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే బీహార్ కు చెందిన విద్యాసాగర్ తో బంధిత బెహరాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. పక్క ఇల్లు కావడంతో ఒకరికి ఒకరు పరిచయం వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వారి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతనిని చంపేయాలని నిర్ణయించుకున్నారు.
మద్యం తాగి వచ్చి...
అయితే ఇటీవల మల్లాపూర్ లో నారాయణ బెహరా, విద్యాసాగర్ లు మద్యం తాగారు. దీంతో తాగొచ్చిన భర్త నారాయణతో బంధిత గొడవకు దిగింది. తాగి అర్ధరాత్రి ఏంటని ప్రశ్నించింది. దీంతో నారాయణ కూడా మత్తులో బంధిత మాట పట్టించుకోకుండా గొడవకు దిగాడు. దీంతో ప్రియుడు విద్యాసాగర్ తో కలసి బంధిత నారాయణ తలపై ఇనుపరాడ్ తో కొట్టి చంపేసింది. అయితే వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి దర్యాప్తు జరిపి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నాలుగు నెలలుగా తమ వివాహేతర సంబంధం కొనసాగుతుందని, అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేశామని బంధిత విచారణ లో అంగీకరించింది.
Next Story

