Fri Jan 23 2026 09:05:38 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఉప్పల్ వెళ్లే వారికి అలెర్ట్. ఈ మార్గంలో వెళితే అంతే
ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే వారు ఈ నెల రోజుల పాటు ఇబ్బందులు పడాల్సిందే.

ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే వారు ఈ నెల రోజుల పాటు ఇబ్బందులు పడాల్సిందే. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు బయలుదేరి వెళతారు. దీంతో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఉప్పల్ సమీపంలోని నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయే అవకాశముంది.
ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్....
అందుకే ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. వేలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణం చేయడం వల్ల ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వద్ద నెమ్మదిగా ప్రయాణం సాగే అవకాశం ఉంది. గంటల కొద్ది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశముంది. మేడారం జాతరకు అన్ని ప్రాంతాల నుంచి ఇదే రహదారిపై నుంచి వెళ్లేందుకు భక్తులు తమ సొంత వాహనాలతో తరలి వస్తుండటంతో ఈ మార్గం వాహనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది.
మేడారం జాతరకు...
మరో నెల రోజుల పాటు ఈ రహదారిపై ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం మంచిదని సూచిస్తున్నరు. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పాలు పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. పోలీసులను నియమించినప్పటికీ అనుకున్న స్థాయిలో వాహనాల క్రమబద్ధీకరణ జరగడం లేదు. దాదాపు 620 కోట్ల రూపాయలతో నిర్మించిన ఉప్పల్ - నారలపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయితేనే ఇక్కడ ట్రాఫిక్ సమస్యకు చెుక్ పడుతుంది. అప్పటి వరకూ ప్రయాణికులకు నరకయాతన అనుభవించక తప్పదు.
Next Story

