Fri Dec 05 2025 23:46:33 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : దాడుల్లో గాయపడింది రౌడీషీటర్ ఒమర్ : సజ్జనార్
చాదర్ ఘాట్ లో జరిగిన కాల్పుల్లో గాయపడింది ఒక రౌడీషీటర్ అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు

చాదర్ ఘాట్ లో జరిగిన కాల్పుల్లో గాయపడింది ఒక రౌడీషీటర్ అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పాతబస్తీకి చెందిన ఒమర్ గా గుర్తించినట్లు సజ్జనార్ తెలిపారు. పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులపై కత్తితో దాడికి ప్రయత్నించగా డీసీపీ చైతన్య కాల్పులు జరిపారని సజ్జనార్ తెలిపారు. డీసీపీకి, కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలు కావడంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఇరవై కేసుల వరకూ...
మహ్మద్ ఒమర్ అన్సారీ కామాటిపూరకు చెందిన రౌడీషీటర్ అని, ఇరవై కేసులు అతనిపై ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు అతనిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులపై దాడికి ప్రయత్నించడంతోనే ఈ కాల్పులు జరిగాయని సజ్జనార్ తెలిపారు. ప్రాధమిక విచారణలో ఈ విషయాలు వెల్లడయయ్యాయని, ప్రస్తుతం ఒమర్ ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు.
Next Story

