Thu Mar 12 2026 15:01:58 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్
హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు ప్రముఖ ఓటీటీసీ సంస్థ వీఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ ను నెట్ ఫ్లిక్స్ స్టూడియోస్ హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సంస్థను ముప్ఫయి వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ప్రారంభించారు. భారత్ లోకి నెట్ ఫ్లిక్స్ అడుగు పెట్టి పదేళ్లవుతున్న సందర్భంగా విస్తరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో యానిమేషన్, గేమింగ్, అండ్ కామిక్స్, విజువల్ ఎఫెక్ట్ రంగంలో హైదరాబాద్ మరింతగా రాణిస్తుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో...
నెట్ ఫ్లిక్స్ సంస్థ పెట్టుబడులు పెట్టడం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని అన్నారు. నెట్ ఫ్లిక్స్ తన ప్రధాన కార్యాలయాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టాలని ఆయన కోరారు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడే నిర్మాణమవుతాయన్న తన ఆకాంక్ష నెరవేరుతుందని, అందుకు నెట్ ఫ్లిక్స్ ఇక్కడకు రావడమే ఉదాహరణ అని అన్నారు. చిన్న నాటి నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో పాటు కలర్, స్కోప్, 70 ఎంఎం, హెచ్.డి. మూవీల వరకూ తాను చూశానని అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇకపై వచ్చే ప్రతి పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా కోరతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.
Next Story

