Sat Jan 17 2026 07:23:41 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు నేడు నిరసన ర్యాలీకి పిలుపు నిచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నేతృత్వంలో ఈ నిరసన ర్యాలీ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం వ్యాపార వర్గాలతో పాటు సికింద్రాబాద్ స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
నిరసన ర్యాలీకి అనుమతి లేదని...
అయితే ఎటువంటి నిరసనల ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ నేతలను తెలంగాణ భవన్ లోనే అడ్డుకున్నారు. కొందరిని ఇంటవద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాము శాంతియుత ర్యాలీని నిర్వహిస్తామని చెప్పినా ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.
Next Story

