Sat Mar 07 2026 19:02:43 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఆయుధాలతో సమస్యలు పరిష్కారం కావు.. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సాధ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 128 ఆయుధాలను అప్పగించారు. 130 మంది లొంగిపోయిన మావోయిస్టులలో 125 మంది చత్తీస్ గఢ్ కు చెందిన వారు. నలుగురు తెలంగాణ, ఒకరు ఏపీకి చెందిన వారని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయుధాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఉన్న మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చారు.
ప్రజాస్వామ్య బద్ధంగానే సమస్యలను ...
ప్రజాస్వామ్య బద్ధంగానే సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఆయుధాలతో సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. తాను అనేక మంది లొంగిపోయిన సెంట్రల్ కమిటీ సభ్యులతో మాట్లాడానని అన్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నానని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో మావోయిజం విస్తరించి ఉందని, గణపతితో పాటు అందరికీ తాము లొంగిపోవాలని సమాచారం ఇస్తామని వారు తనతో చెప్పారని అన్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సెంట్రల్ కమిటీ సభ్యులు చేసిన సూచనలు వారి ముందుపెట్టానని తెలిపారు.
ఆయుధాలతో సహా ...
ఆయుధాలతో సహా అందరికీ లొంగిపోవాలని, ఎవరు లొంగిపోయినా వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని, వారికి పునరావాసం కల్పిస్తామని అమిత్ షా కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. శాంతియుత మార్గంలోనే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వారి సొంత గ్రామాల్లో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఇళ్ల స్థలం ఉన్నవారికి కూడా ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా పునరావసం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయుధాలతో ప్రభుత్వాన్ని బెదిరించలేరన్నారు. అజ్ఞాతవాసంలో ఉన్న మావోయిస్టులందరూ వచ్చి ఆయుధాలతో లొంగిపోవాలని, అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుందని చెప్పారు. గణపతి ఆరోగ్యం బాగాలేదని తెలిసిందని, వారు కూడా లొంగిపోవాని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
Next Story

