Sun Apr 05 2026 14:44:10 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పర్యటన
నేడు హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు

నేడు హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. న్యూ నల్లకుంటలో నరేంద్ర పార్క్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించనున్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.
రాష్ట్ర నేతలతో...
అనంతరం కిషన్ రెడ్డి నేడు రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యే అవకాశముంది. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల విషయంపై కిషన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను కూడా ముందుగా ఖరారు చేసుకోవాలని నిర్దేశించనున్నారు.
Next Story

