Fri Mar 13 2026 10:00:33 GMT+0530 (India Standard Time)
Hyderabad : గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జీహెచ్ఎంసీ ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి 'వన్ టైమ్ సెటిల్మెంట్' ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ఈ నెల 31వ తేదీలోగా చెల్లిస్తే, వడ్డీపై 90 శాతం రాయితీ లభిస్తుంది.
ఆన్ లైన్ లో చెల్లించేలా...
ఆన్లైన్లో ww.ghmc.gov.in పోర్టల్, MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లలో పన్ను చెల్లించవచ్చు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఈ సదావకాశాన్ని వినియోగించుకుని నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.వడ్డీ రాయితీని నగర ప్రజలు వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు.
Next Story

