Sun Mar 22 2026 03:39:49 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ లోనే చంద్రబాబు
నేడు హైదరాబాద్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ఉండనున్నారు

నేడు హైదరాబాద్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ఉండనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పర్యటన తర్వాత హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మూడు రోజుల పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.
ఈరోజు హైదరాబాద్ లోనే ఉండి...
హైదరాబాద్ లో కొన్ని కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశముంది. మరొకవైపు ఈరోజు హైదరాబాద్ నివాసంలోనే చంద్రబాబు బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. అయితే వారితో కొద్దిసేపు మాట్లాడే అవకాశాలున్నాయి.
Next Story

