Sun Jan 25 2026 06:10:43 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో ఒక మృతదేహం లభ్యం
నాంపల్లిలో నిన్న సాయంత్రం ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక మృతదేహం కనిపించింది

నాంపల్లిలో నిన్న సాయంత్రం ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక మృతదేహం కనిపించింది. గత ఇరవై ఒక్క గంటలుగా శ్రమించిన రెస్క్యూ టీమ్ కు వృద్ధురాలి మృతదేహం కనిపించింది. అరవై ఏళ్ల వృద్ధురాల మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించారు. మరో నలుగురు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నలుగురి కోసం గాలింపు...
మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురి కోసం వారి బంధువులు బయట నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు. భవనంలోకి వెళ్లడానికి కష్టసాధ్యంగా మారడంతో అనేక ప్రయత్నాలు చేసి చివరకు లోపలికి రెస్క్యూ టీం చేరుకుంది. అయితే ఆ నలుగురు సజీవంగా ఉంటారన్న నమ్మకం మాత్రం లేదు. ఇప్పటికే ఇరవై గంటలు దాటిపోవడంతో ఆశలుసన్నగిల్లుతున్నాయి.
జేఎన్టీయూ నిపుణుల బృందాన్ని...
నాంపల్లి ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. భవన భద్రతపై అనుమానాల నేపథ్యంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణుల బృందం నాంపల్లికి చేరుకోనుంది. గత 21 గంటలుగా భవనం సెల్లార్లలో మంటలు కొనసాగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సెల్లార్లకు రంధ్రాలు పడి పైకి పొగ వెలువడుతోంది. భవనం దృఢత్వంపై అధికారులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ నిపుణుల బృందం భవనాన్ని పూర్తిగా తనిఖీ చేసి సురక్షిత స్థితిపై నివేదిక సమర్పించనుంది.
Next Story

