Sun Jul 20 2025 06:58:20 GMT+0000 (Coordinated Universal Time)
ఈ మామిడి పండు ధర 900 రూపాయలు
భారీ పరిమాణంలో ఉన్న ‘నూర్జహాన్’ రకానికి చెందిన మామిడి పండు అందరినీ ఆకర్షిస్తోంది.

భారీ పరిమాణంలో ఉన్న ‘నూర్జహాన్’ రకానికి చెందిన మామిడి పండు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ మామిడి పండు బరువు మూడు కిలోలు. కిలో ధర 300 రూపాయల చొప్పున 900 రూపాయలకు మార్కెట్ లో లభిస్తోంది. ఈ రకం మామిడి మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో మాత్రమే పండుతుంది. భారీ పరిమాణం, మంచి రుచితో ఉండే ఈ రకం మామిడిపళ్లను ఆదిలాబాద్ జిల్లా కోర్టు దారిలో అమ్ముతున్నారు. ఒక్కోటి రెండు కిలోల నుంచి అయిదు కిలోల బరువు వరకు ఉన్నాయి. గతంలో కిలో 500 రూపాయలు అమ్మేవారట. మొఘల్ రాణి పేరు మీద ఈ పండుకు ఈ పేరు వచ్చింది.
Next Story