Tue Mar 17 2026 10:05:09 GMT+0530 (India Standard Time)
Heart Attack : గుండెపోటు ఇలా వస్తుంది.. నిపుణుల హెచ్చరిక ఇదే
నిండా నలభై ఐళ్లు లేవు. అయితే ఆ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది.

నిండా నలభై ఐళ్లు లేవు. అయితే ఆ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. గృహప్రవేశ వేడుకలో ఫోటోదిగుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన మహిళ వీడియో వైరల్ గా మారింది. ఖమ్మం పట్టణంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్ళారు. పోటో దిగే సమయంలో గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ వేడుకలో విషాదం నెలకొంది.
అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు:
సైలెంట్ హార్ట్ ఎటాక్: రక్తనాళాల్లో పూడికలు ఉన్నప్పటికీ, ఎటువంటి లక్షణాలు బయటపడకుండా అకస్మాత్తుగా తీవ్రమవ్వడం.
తీవ్రమైన ఒత్తిడి: శుభకార్యాల సమయంలో నిద్రలేమి, అలసట మరియు మానసిక ఒత్తిడి గుండెపై అదనపు భారాన్ని పెంచుతాయి.
జీవిత విధానంలో మార్పులు: వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం మరియు పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు.
పోస్ట్-వైరల్ ప్రభావాలు: గత కొన్ని ఏళ్లుగా వైరల్ ఇన్ఫెక్షన్ల తర్వాత గుండె కండరాలు బలహీనపడటం వంటి సమస్యలు కూడా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు
ముందస్తు జాగ్రత్తలివే...
రెగ్యులర్ చెకప్స్ : 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా ECG, 2D Echo మరియు Lipid Profile పరీక్షలు చేయించుకోవడం మంచిది.
లక్షణాలను ఇలా : దవడ నొప్పి, ఎడమ చేయి లాగడం, విపరీతమైన చెమటలు పట్టడం లేదా గ్యాస్ సమస్యలా అనిపించే అశాంతిని నిర్లక్ష్యం చేయవద్దు.
ఆరోగ్యకరమైన ఆహారం: ఉప్పు, నూనె మరియు పంచదార వాడకాన్ని తగ్గించి, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
తక్షణ సహాయం : ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలితే, వెంటనే CPR (Cardiopulmonary Resuscitation) చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను నేర్చుకోవడం ప్రాథమిక అవసరం.
అతిగా శ్రమించవద్దు: పండగలు లేదా వేడుకల సమయంలో శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. అలసటగా అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోండి.
Next Story

