Telangana : గుడ్ న్యూస్.. నేటి నుంచి ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణలోనూ అమలు కానుంది

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణలోనూ అమలు కానుంది. నేటి నుంచి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు సిద్దమైంది. ఉచితంగా ఈ టీకాను అమ్మాయిలకు అందించనుంది.రాష్ట్రంలో పదిహేనేళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలకు ఈ టీకా వేస్తారు. రాష్ట్రంలో ఈ వయస్సు ఉన్న అమ్మాయిలు దాదాపు 4 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ప్లానింగ్ సర్వే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతోంది. ఈ సర్వే ద్వారా 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలు ఏ స్కూళ్లల్లో ఉన్నారు..? ఎంతమంది ఉన్నారు..? బయట ఎంతమంది ఉన్నారు? అనే సమగ్ర వివరాలను సేకరించింది.

