Sun Jul 20 2025 05:48:45 GMT+0000 (Coordinated Universal Time)
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా?
వంటల కోసం అల్యూమినియం పాత్రలను అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారా?

utensils ఈ పాత్రలని అధికంగా వాడకం వల్ల ఆరోగ్యానికి దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో అల్యూమినియం పాత్రలకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని తెలిపారు. ఆ పాత్రల వాడకం, నాణ్యతను బట్టి ప్రతి 12 నుంచి 24 నెలలకు ఒకసారి మార్చాలట. రెండేళ్లు దాటిన అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం హానికరం. అల్యూమినియం మెత్తటి లోహం. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువ కాలం వాడితే.. ఆ పాత్ర నాణ్యత తగ్గుతుంది. సాధారణంగా తేలికైన అల్యూమినియం పాత్రలు ఒక సంవత్సరం వరకు మాత్రమే వాడాలి, మధ్యస్థ, బరువైన పాత్రలను రెండు సంవత్సరాల వరకు వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Next Story