Fri Dec 05 2025 12:21:46 GMT+0000 (Coordinated Universal Time)
సమంత సంచలన నిర్ణయం.. ఆ పోస్ట్ డిలీట్ !
చై-సామ్ మళ్లీ కలిసిపోతున్నారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. నాగచైతన్య మాత్రం

టాలీవుడ్ కపుడ్ సమంత - నాగచైతన్య గతేడాది తామిద్దరం విడిపోతూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. తాజాగా సమంత తన ఇన్ స్టా లో విడాకుల ప్రకటనను డిలీట్ చేసింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. అప్పట్లో సమంత చేసిన విడాకుల ప్రకటనను ఇప్పుడు ఓపెన్ చేస్తే.. అవైలబుల్ లేదని చూపిస్తోంది.
సమంత విడాకుల ప్రకటనను డిలీట్ చేయడంపై నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చై-సామ్ మళ్లీ కలిసిపోతున్నారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. నాగచైతన్య మాత్రం తన సోషల్ మీడియా నుంచి విడాకుల ప్రకటనను తొలగించలేదు. విడాకుల ప్రకటన అనంతరం సామ్ .. చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది. అలాగే విడాకుల ప్రకటనను కూడా తొలగించి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. విడాకుల ప్రకటన చేసి చాలా రోజులు అయిన నేపథ్యంలో.. దాని అవసరం లేదని భావించి డిలీట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
Next Story

