Wed Dec 17 2025 12:55:21 GMT+0000 (Coordinated Universal Time)
BIGG BOSS TELUGU OTT : హోస్ట్ నాగార్జున కాదా ?
రెండు ప్రోమోల్లోనూ నాగార్జునే బిగ్ బాస్ ను ప్రమోట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ను కూడా ఆయనే హోస్ట్ చేస్తారని..

బిగ్ బాస్.. హిందీ మొదలైన ఈ బుల్లితెర షో.. క్రమంగా పలు భారతీయ భాషల్లోనూ ప్రారంభమై బాగా పాపులర్ అయింది. హిందీ బిగ్ బాస్ ఇప్పటికే ఓటీటీ లో ప్రసారం చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు అదేబాటలో తెలుగు బిగ్ బాస్ కూడా పయనిస్తోంది. టీవీలో తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా ఫిబ్రవరి 26 నుండి 24 గంటలు ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తెలుగు ఓటీటీ షో కూడా మొదలు కానుంది. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు వదిలారు మేకర్స్.
Also Read : ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
రెండు ప్రోమోల్లోనూ నాగార్జునే బిగ్ బాస్ ను ప్రమోట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ను కూడా ఆయనే హోస్ట్ చేస్తారని అందరూ భావించారు. భావించడమేంటి.. స్వయంగా నాగార్జునే ఈ విషయాన్ని చెప్పారు. అయితే 24 గంటల టెలీకాస్ట్ కావడంతో.. ఈ షో కోసం కాస్త ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అక్కడే అనుమానం మొదలైంది నెటిజన్లకు. ఇంకేముంది బిగ్ బాస్ ఓటీటీ షో ను నాగార్జున హోస్ట్ చేయడం లేదా ? అంటూ చర్చ మొదలు పెట్టేశారు.
ఆ చర్చ అంతటితో ఆగలేదు.. బుల్లితెర స్టార్ యాంకర్ అయిన రవి.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ను హోస్ట్ చేయనున్నాడంటూ ప్రచారం చేశారు. ఇప్పుడీ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. అంతపెద్ద రియాలిటీ షో ను హోస్ట్ చేసేందుకు.. స్టార్ స్టేటస్ తో పాటు క్రేజ్ ఉన్న హీరోలనే హోస్ట్ గా తీసుకుంటారని రవి హోస్ట్ అనేది వాస్తవం కాదని కూడా బిగ్ బాస్ అభిమానులు వాదిస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఫిబ్రవరి 26 వరకూ ఆగాల్సిందే.
News Summary - Nagarjuna is Not Hosting bigg boss telugu OTT ?
Next Story

