Fri Dec 05 2025 12:25:40 GMT+0000 (Coordinated Universal Time)
సమంత ప్రెగ్నెంట్.. అందుకోసమేనా ?
సామ్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతోందని తెలుస్తోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

హీరోయిన్లంటే.. గ్లామర్ రోల్స్ కే పరిమితం అనుకునే రోజులు పోయాయి. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు రమ్యకృష్ణ, శ్రీదేవి, జ్యోతిక, నయనతార, కీర్తి సురేష్, త్రిష ఇలా పలువురు హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి.. హీరోలకు తామూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. తాజాగా సమంత కూడా ఆ లిస్ట్ లో నిలవనుంది.
సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న యశోద సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. హరి, హరీష్ లు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సామ్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతోందని తెలుస్తోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో సామ్ నర్స్ గా, గర్భవతిగా కనిపించనుంది. నర్సైన మహిళ.. గర్భవతిగా ఒంటరిగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అనే కోణంలో యశోద సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే.. సామ్ గర్భవతి కావాలన్న కల ఇలా నెరవేరబోతోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
News Summary - Heroine Samantha Playing a Pregnant Woman role in Yashoda Movie
Next Story

