Fri Sep 13 2024 03:06:44 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలకు షాకిచ్చిన ఆ కుటుంబం
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు మరో షాక్ తగిలింది. రేపు మంచిర్యాల జిల్లాలో లింగాపూర్ లో దీక్ష చేయాలని వైెఎస్ షర్మిల నిర్ణయించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు మరో షాక్ తగిలింది. రేపు మంచిర్యాల జిల్లాలో లింగాపూర్ లో దీక్ష చేయాలని వైెఎస్ షర్మిల నిర్ణయించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు మరో షాక్ తగిలింది. రేపు మంచిర్యాల జిల్లాలో లింగాపూర్ లో దీక్ష చేయాలని వైెఎస్ షర్మిల నిర్ణయించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల సమస్యలపై వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి లింగాపూర్ గ్రామంలో మరణించిన నిరుద్యోగి భూక్యా నరేష్ ఇంటి వద్ద దీక్షకు దిగాలనుకున్నారు. కానీ వైఎస్ షర్మిలను ఆ కుటుంబం వేడుకుంది. తమ ఇంటికి రావద్దంటూ విజ్ఞప్తి చేసింది. తమ కొడుకు మరణాన్ని రాజకీయం చేయవద్దంటూ భూక్యా నరేష తండ్రి శంకర్ నాయక్ కోరారు. దీంతో వైఎస్ షర్మిల రేపటి దీక్ష ఎక్కడ జరుగుతుందనేది తెలియాల్సి ఉంది.
Next Story