Mon Mar 16 2026 20:21:41 GMT+0530 (India Standard Time)
నేడు ఎమ్మెల్యేలతో కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై చర్చిస్తారు. ఇప్పటికే గ్రేటర్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై చర్చిస్తారు. ఇప్పటికే గ్రేటర్ [more]

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై చర్చిస్తారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ ఛార్జులుగా కేసీఆర్ నియమించారు. దీంతో పాటు వార్డుల వారీగా కూడా కొందరిని బాధ్యలుగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఈ సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు. దుబ్బాక ఉప ఎన్నికల ఓటమిపై కూడా విశ్లేషించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు శాసనసభ పక్ష సమావేశం తెలంగాణ భవన్ లో జరగనుంది.
Next Story