Fri Dec 05 2025 16:24:40 GMT+0000 (Coordinated Universal Time)
8000రూపాయలు ఇస్తే కానీ పావలా ఇవ్వడం లేదు!
అరుదైన నాణేలను సేకరించాలని అనుకునే వారు. వాటి కోసం ఎంతైనా పెట్టడానికి ముందుకు వస్తుంటారు

అరుదైన నాణేలను సేకరించాలని అనుకునే వారు. వాటి కోసం ఎంతైనా పెట్టడానికి ముందుకు వస్తుంటారు. ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో జరిగిన కరెన్సీ ఫెస్టివల్ లో అరుదైన కరెన్సీ నాణెలు, నోట్లు ప్రదర్శించారు. ఈ కరెన్సీ ఫెస్టివల్ లో 25 పైసల నాణెం 8 వేలు రూపాయలు పలుకుతోంది. చలామణిలో లేని కరెన్సీ నోట్లు, కాయిన్లు కూడా చాలా విలువైనవని ఈ ఫెస్టివల్ ను చూస్తే తెలిసిపోతుంది. ఆంగ్లేయులు, మెుఘలుల కాలం నాటి 2 రూపాయల నాణెం మూడు లక్షల రూపాయిల ధర పలుకుతోంది. 50 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయల నోటు ధర 40 వేలు. 108 ఏళ్ల నాటి రూపాయి నోటు ధర 10,000 నుండి 12,000 వరకు ఉంది. మొఘల్ కాలంనాటి రూపాయి నోటు ధర ఏకంగా 20,000 పలుకుతోంది. ఆంగ్లేయుల కాలం నాటి రూపాయి, 5 రూపాయల నోటుకు వేల రూపాయలు పెట్టాల్సిందే.
Next Story

