ఫ్యాక్ట్ చెక్: ఉదయపూర్ ఫైల్స్ అనే సినిమాకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన నిరసన ర్యాలీ ని వైరల్ వీడియో చూపిస్తోంది
దర్జీ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా నిర్మించిన 'ఉదయపూర్ ఫైల్స్' సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా

Claim :
త్వరలో విడుదల కానున్న ఉదయపూర్ ఫైల్స్ సినిమాకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారుFact :
తమిళనాడులో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనను చూపించే వీడియో ఏప్రిల్ 2025లో చిత్రీకరించారు
దర్జీ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా నిర్మించిన 'ఉదయపూర్ ఫైల్స్' సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా జూలై 10, 2025న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా CBFC (కేంద్రం మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని పలువురు కోర్టులను ఆశ్రయించారు. సినిమాను పర్మనెంట్‌గా బ్యాన్ చేయాలని కోరుతూ కొందరు అభ్యరిస్తున్నారని, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఉదయ్‌పూర్ ఫైల్స్ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా స్టే ఇస్తున్నామని ఢిల్లీ హైకోర్టు జూలై 10వ తేదీన తీర్పును ఇచ్చింది. ఈ సినిమా ద్వేషపూరిత వాదనలను ప్రోత్సహిస్తుందని, ఒక కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుంటుందని, మత ఉద్రిక్తతలను ప్రేరేపించగలదని పిటీషన్ లో వాదించారు. ఇక సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ మౌలానా అర్షద్ మదాని పిటిషన్ దాఖలు చేశారు.

