ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో అహ్మదాబాద్ కాదు, హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూపిస్తోంది
ఎయిర్ ఇండియా అహ్మదాబాద్-లండన్ విమానాన్ని (AI-159) మంగళవారం, జూన్ 17, 2025న రద్దు చేసింది. ఇలా రద్దు చేయడానికి కారణం

Claim :
విమాన ప్రయాణీకులు భయంతో అరుస్తున్న టేక్ ఆఫ్ వీడియో అహ్మదాబాద్ - లండన్ విమానానికి చెందిందిFact :
వీడియోలో టేక్ ఆఫ్ సమయం లో కనపడుతోంది అహ్మదాబాద్ విమ్మనాశ్రయం కాదు, హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఎయిర్ ఇండియా అహ్మదాబాద్-లండన్ విమానాన్ని (AI-159) మంగళవారం, జూన్ 17, 2025న రద్దు చేసింది. ఇలా రద్దు చేయడానికి కారణం సాంకేతిక లోపం కాదు, ముందస్తు తనిఖీల కారణంగా విమానం అందుబాటులో లేదని తెలుస్తోంది. జూన్ 12న AI-171 విమానం కూలిపోయిన తర్వాత కొత్త కోడ్‌తో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారు. బోయింగ్ 787 -8 డ్రీమ్లైనర్ల విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. రద్దు చేసిన ఇతర విమానాలలో AI 915 (ఢిల్లీ-దుబాయ్), AI 153 (ఢిల్లీ-వియన్నా), AI 143 (ఢిల్లీ-పారిస్), AI 133 (బెంగళూరు-లండన్), AI 170 (లండన్-అమృత్సర్) ఉన్నాయి. ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ప్రయాణాన్ని ఏర్పాటు చేసినట్లు లేదా ప్రభావిత ప్రయాణీకులకు పూర్తి వాపసు/రీషెడ్యూలింగ్‌ను అందించినట్లు తెలిపింది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత డ్రీమ్‌లైనర్ విమానాల విషయంలో పరిశీలన పెరిగిన నేపథ్యంలో కొన్ని విమానాలను రద్దు చేశారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు కీలకమైన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు ధ్రువీకరించారు. ఇప్పటికే ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) కూడా లభించినట్టు విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం (AAIB) ప్రకటించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ముఖ్యంగా కుడివైపు ఇంజిన్‌పై దృష్టి సారించారు. ఆ ఇంజిన్‌ను ఈ ఏడాది మార్చిలో ఓవర్‌హాల్ చేసి తిరిగి అమర్చినట్లు గుర్తించారు. అంటే మరమ్మతులు చేసిన కొద్ది నెలలకే ఇలా జరగడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. దాదాపు 12 ఏళ్ల నాటి బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానానికి చివరిసారిగా 2023 జూన్‌లో పూర్తిస్థాయిలో నిర్వహణ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ఏడాది డిసెంబర్లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఇంజిన్ ఓవర్‌హాల్ చేసిన తర్వాత ఇంత తక్కువ సమయంలోనే ప్రమాదం జరగడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత లోతైన విచారణ జరుగుతోంది.
ఇంతలో, రన్‌వే నుండి బయలుదేరిన విమానం కిటికీ నుండి విమానాశ్రయం ఏరియల్ వ్యూ చూపుతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో క్రాష్ అయిన AI 171 విమానానికి చెందిందనే వాదనతో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, విమానంలో పెద్ద శబ్దాలు, ప్రజలు భయంతో కేకలు వేయడం మనం వినవచ్చు. “Ahmedabad to London live plane crash.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినది కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ వీడియో నుండి కొన్ని స్క్రీన్షాట్లను పోలి ఉండే చిత్రాలను షేర్ చేసిన కొన్ని వెబ్సైట్ కథనాలు లభించాయి. చిత్రాలు చెక్ లాప్ కోక్ విమానాశ్రయం అని పిలువబడే హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూపుతున్నాయి.
వైరల్ వీడియోలోని విజువల్స్‌ను పోలి ఉండే విమానాశ్రయం ఏరియల్ వ్యూ సంబంధించిన విజువల్స్ అనేక స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లు పంచుకుంటాయి. పోలిక ఇక్కడ ఉంది.
"టేకాఫ్ సమయంలో భయంకరమైన క్షణం! విమాన ఇంజిన్ లో వింతైన, పెద్ద శబ్దాలు రావడం మొదలైంది. అది పక్షిని ఢీకొనడం వల్లనా? ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు, కేకలతో క్యాబిన్ నిండిపోయింది, ఈ ధైర్యవంతురాలైన మహిళ అన్నింటినీ వీడియోలో బంధించింది. ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేని విమాన ప్రయాణాలలో ఒకటి. చివరి వరకు చూడండి" అంటూ పోస్టులు పెట్టారు
చెప్ లాప్ కోక్ విమానాశ్రయం ఏరియల్ వ్యూ ను చూపించే విజువల్స్ కోసం మరింత శోధించినప్పుడు, కొన్ని వీడియోలు లభించాయి. మే 19, 2025న షేర్ చేసిన ఒక YouTube షార్ట్ వీడియో, హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏరియల్ వ్యూ చూపిస్తుంది, ఇది వైరల్ వీడియోలోని దృశ్యాలను పోలి ఉంటుంది.
ఈ వీడియో ఏ విమానంలో చిత్రీకరించారో, ఇతర వివరాలను మేము నిర్ధారించలేకపోయినప్పటికీ, ఆ వీడియో జూన్ 12, 2025న క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించింది కాదని మేము ధృవీకరించగలిగాము. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.

