Tue Jul 15 2025 16:32:36 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాన్ని చూపుతున్న వైరల్ వీడియో ఏఐ తో చేసింది
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదంపై దర్యాప్తుకు భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్

Claim :
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాన్ని ఈ వీడియో చూపిస్తోందిFact :
వీడియో నిజమైన సంఘటనను చూపడం లేదు. వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదంపై దర్యాప్తుకు భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దృష్టి పెట్టింది. జూన్ 12న జరిగిన ప్రమాదంలో దాదాపు 270 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు చెందిన బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. స్థానిక అధికారులు, ఏజెన్సీల నుండి అవసరమైన అన్ని మద్దతుతో AAIB దర్యాప్తు క్రమంగా సాగుతోందని, సైట్ డాక్యుమెంటేషన్, ఆధారాల సేకరణతో సహా కీలక పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు మరింత విశ్లేషణ జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ప్రమాదం తర్వాత అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషించాల్సి ఉండగా దాన్ని విదేశాలకు తరలిస్తారంటూ వచ్చిన కథనాలపై కేంద్రం స్పందించింది. బ్లాక్ బాక్స్ ను ఎక్కడ డీకోడ్ చేయాలనేది ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. సేఫ్టీ, సెక్యూరిటీ, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ 787-8 విమాన ప్రమాదానికి సంబంధించిన ఫుటేజీని పదిహేడేళ్ల ఆర్యన్ అన్సారీ రికార్డ్ చేశాడు. విమానం వేగంగా కిందకు వస్తూ ఉండగా, క్షణాల్లో మంటల్లో చిక్కుకుపోవడాన్ని చూపించే వీడియో విస్తృతంగా వైరల్ అయింది. అది విమానం చివరి క్షణాలకు సంబంధించిన కీలకమైన రికార్డుగా మారింది.
కానీ ఇటీవల, నివాస ప్రాంతంలోకి భారీ విమానం కూలిపోవడాన్ని చూపించే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది, ఇది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిందనే వాదనతో షేర్ చేస్తున్నారు
వైరల్ అవుతున్న పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియోను AI ద్వారా సృష్టించారు.
జాగ్రత్తగా గమనించినప్పుడు, విమానం ఇళ్లకు చాలా దగ్గరగా ఎగురుతున్నట్లు మనం చూడవచ్చు. విమానం ఇళ్లపైకి దూసుకెళ్లే ముందు ఆగిపోతుంది. సమీపంలోని ఇళ్లపై నిలబడి విమానం భవనాలపై పడటం అనేక మంది చూస్తూ ఉండడం కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. కానీ నివేదికల ప్రకారం, విమానం ఒక వైద్య కళాశాల హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లడానికి ముందు 40 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. మేము CCTV ఫుటేజ్, వైరల్ అవుతున్న ఇతర వీడియోలను తనిఖీ చేసినప్పుడు, విమానం కూలిపోయినప్పుడు సమీపంలో ఎవరూ నిలబడి లేరని గమనించాం.
ఎయిర్ ఇండియా విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకుని అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో కూలిపోయింది. కూలిపోయే ముందు అది ఇళ్లకు చాలా దగ్గరగా ఎగరలేదు. కాబట్టి, వైరల్ వీడియో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన నిజమైన వీడియో కాదని మనం నిర్ధారించవచ్చు.
దీని నుండి ఒక క్లూగా తీసుకొని, అది AI ద్వారా సృష్టించారా లేదా అని నిర్ధారించడానికి మేము వీడియోను తనిఖీ చేసాము. మేము వేర్వేరు సాధనాలతో తనిఖీ చేసినప్పుడు, వీడియో వాస్తవానికి AI ద్వారా సృష్టించారని మేము నిర్ధారించగలిగాము.
మేము ఉపయోగించిన మొదటి ఏఐ సాధనం ‘AI or Not’; సంబంధిత ఫలితాలు వీడియో AI ద్వారా సృష్టించినట్లుగా చూపించాయి. ఫలితాల స్క్రీన్‌షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
మేము ఉపయోగించిన రెండవ సాధనం ‘was it AI?', ఇది కూడా వీడియో AI సాంకేతికతను ఉపయోగించి సృష్టించినట్లుగా నిర్ధారించింది. ఫలితాల స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.
కనుక, విమాన ప్రమాదానికి సంబంధించిన వైరల్ వీడియో జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం నిజమైన ఫుటేజ్ కాదు. ఈ వీడియో AI ద్వారా సృష్టించిన వీడియో. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను ఈ వీడియో చూపిస్తుందనే వాదన నిజం కాదు.
Claim : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాన్ని ఈ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story