Sun Oct 13 2024 19:16:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాజస్థాన్‌లోని పొలాల్లో ఉల్క పడిందన్న వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదు
గ్రహశకలం 2024 RN 16 సెప్టెంబరు 2024న భూమికి ఎలాంటి ప్రమాదం కలుగజేయకుండా వెళ్ళిపోయింది. గంటకు 104, 761 కిలోమీటర్ల వేగంతో
Claim :
రాజస్థాన్‌లోని పొలాల్లో తోక చుక్క పడడాన్ని వైరల్ వీడియో చూపిస్తుందిFact :
వీడియోను VFX ఉపయోగించి రూపొందించారు. నిజమైన ఉల్క పడిన ఘటన కాదు
గ్రహశకలం 2024 RN 16 సెప్టెంబరు 2024న భూమికి ఎలాంటి ప్రమాదం కలుగజేయకుండా వెళ్ళిపోయింది. గంటకు 104, 761 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చిన ఈ గ్రహశకలం కారణంగా భూ గ్రహంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని చాలా మంది భయపడ్డారు. కానీ ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్‌లోని కొంతమంది స్థానికులు ఇటీవల రాజస్థాన్‌లో తోక చుక్క పడడాన్ని తాము చూశామని తెలిపారు. అయితే ఈ వార్తలను అధికారులు ధృవీకరించలేదు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఖగోళ సంఘటన భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో జరిగిందని పేర్కొంటూ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. కొందరు ఇది ఉల్క అని వాదించగా, మరికొందరు ప్రతిరోజూ జరిగే సాధారణ ఖగోళ సంఘటనగా కొట్టిపారేశారు.
ఇంతలో, భూమిపై ఖగోళ వస్తువు పడిపోతున్నట్లు చూపించే వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఓ వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో అప్లోడ్ చేశారు. అయితే ఇటీవల రాజస్థాన్‌లో సంభవించిన ఉల్క పతనాన్ని ఈ వీడియో చూపుతుందనే వాదనతో షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో రాజస్థాన్‌లో ఉల్క పడిన ఘటనకు సంబంధించింది కాదు.
మేము ఇన్విడ్ టూల్‌ని ఉపయోగించి వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించాం. వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వీడియోలో ఉన్నది నిజమైన సంఘటన కాదని మేము కనుగొన్నాము. ఇది విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన వీడియో. నవంబర్ 2023లో unreal vfx అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వీడియోను అప్లోడ్ చేసారు. #монтаж #meteor #fall #vfx #aftereffects #vfxbreakdown #unrealfxy #boom అనే హ్యాష్ ట్యాగ్స్ ను ఉపయోగించారు.
అదే యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసిన మరో వీడియో కెమెరాలో చిక్కుకున్న 10 వేర్వేరు ఉల్కాపాతాలను చూపుతుంది. ఈ వీడియోను కూడా #vfx #cgi #unrealvfx మొదలైన హ్యాష్ ట్యాగ్స్ ను ఉపయోగించి వీడియోను పోస్టు చేశారు.
ఉల్కాపాతానికి సంబంధించిన అనేక వీడియోలు ఉన్న unreallvfx పేరుతో మేము Instagram ఛానెల్‌ని కూడా కనుగొన్నాము. ఖాతా డిజిటల్ క్రియేటర్ కు చెందినదని బయోలో ఉంది. VFX.CGI, వీడియో ఎడిటర్ అని వివరాలను ఇచ్చారు.
మార్చి 16, 2024న షేర్ చేసిన వైరల్ వీడియోను మీరు చూడొచ్చు. వీడియోను సృష్టించడంలో పనిచేసిన వ్యక్తుల వివరాలను కూడా షేర్ చేశారు. "40% DISCOUNT FOR MY FOLLOWERS. LINK IN BIO. VIDEO OLINDI: Kazakhstan. ISHLOV BERDI: @unreallvfx — 3D Moushn Dizayner ISHLOV BERILDI: Adobe After Effects dasturida" అంటూ వీడియోను పోస్టు చేశారని కనుగొన్నాం.
రాజస్థాన్‌లో ఉల్కాపాతం జరిగినట్లుగా తప్పుడు వాదనతో వీడియోను వైరల్ చేస్తున్నారు. vfxని ఉపయోగించి రూపొందించిన వీడియో అది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : రాజస్థాన్‌లోని పొలాల్లో తోక చుక్క పడడాన్ని వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Youtube Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Youtube
Fact Check : False
Next Story