Fri Dec 05 2025 08:22:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: యువకుడు విమానాన్ని ఎగురవేస్తున్న వీడియో బీహార్ కు చెందింది కాదు, బాంగ్లాదేశ్ కి సంబంధించింది
ఇతర దేశాల వీడియోలు, చిత్రాలు కొన్నిసార్లు సోషల్ మీడియాలో భారతదేశానికి సంబంధించినవని చెబుతూ వైరల్ చేస్తూ ఉంటారు.

Claim :
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు కేవలం ఒక వారంలోనే స్క్రాప్ మెటీరియల్స్‌తో విమానాన్ని తయారు చేశారుFact :
వైరల్ విజువల్స్ బంగ్లాదేశ్ కు చెందిన ఒక యువకుడిని చూపిస్తున్నాయి. బీహార్ కు సంబంధించినది కాదు.
ఇతర దేశాల వీడియోలు, చిత్రాలు కొన్నిసార్లు సోషల్ మీడియాలో భారతదేశానికి సంబంధించినవని చెబుతూ వైరల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇలాంటి కథనాలు భారతదేశానికి ప్రతికూలంగా ప్రచారం చేయడానికి ఉద్దేశించినవి కాగా, మరికొన్ని భయాందోళనలను సృష్టించడానికి లేదా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి వాడుతూ ఉంటారు. కొంతమంది వినియోగదారులు ఇతర దేశాల ప్రజలు సాధించిన విజయాలను భారతీయులు చేసినవిగా కూడా పంచుకుంటారు. అలా వాటిని భారతదేశానికి ఆపాదిస్తారు.
ఒక యువకుడు విమానం నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా Xలో వైరల్ అవుతోంది. అతను బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన టీనేజర్ అని చెబుతూ ఉన్నాయి ఆ పోస్టులు. అతని పేరు అవనీష్ కుమార్, అతను స్క్రాప్ మెటీరియల్స్ ను మాత్రమే ఉపయోగించి ఒక వారంలో విమానాన్ని నిర్మించాడని అందులో తెలిపారు. వీడియోలోని శీర్షిక ప్రకారం “బ్రేకింగ్. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన అవనీష్ కుమార్ అనే యువకుడు కేవలం ఒక వారంలో ఎగిరేలా విమానాన్ని నిర్మించాడు. అతను ఈ విమానాన్ని కేవలం ₹ 7,000 ఖర్చుతో ఒక వారంలోనే నిర్మించాడు. భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు” అని అర్థం వస్తోంది.
మరికొందరు “बिहार के युवा अवनीश कुमार ने केवल एक सप्ताह में, केवल स्क्रैप का उपयोग करके लगभग 7,000 रुपये की लागत से उड़ने वाला विमान बना डाला। बिहार में एक से बढ़कर एक टैलेंटेड लोग हैं जिन्हें सही मार्गदर्शन मिलने पर कुछ भी करने की क्षमता रखते हैं।“ అంటూ హిందీ క్యాప్షన్ లో వీడియోను పోస్టు చేశారు.
కొంతమంది వినియోగదారులు అదే శీర్షికతో వీడియోకు సంబంధించిన స్క్రీన్షాట్లను పంచుకున్నారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఒక యువకుడు విమానం నడుపుతున్నట్లు చూపించే వీడియో భారతదేశంలోని బీహార్‌కు చెందినది కాదు.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము, ఆ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదని గుర్తించాం, బంగ్లాదేశ్ కు సంబంధించినదని చెబుతూ ఉన్న అనేక పోస్ట్‌లను మేము కనుగొన్నాము. మార్చి 11, 2025న షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను మేము కనుగొన్నాము, అందులో బెంగాలీలో "రైతు కుమారుడు జుల్హాస్ విమానం వేలాది మంది ప్రజల ముందు బయలుదేరింది" అని అర్థం వచ్చేలా పోస్టులు పెట్టారు.
“সবাইকে অবাক করে কৃষকের ছেলে জুলহাসের বিমান আবারো আকাশে উড়লো” అంటూ బెంగాలీలో క్యాప్షన్‌తో అదే వీడియోను చూపించే ఫేస్బుక్ పోస్ట్‌ను కూడా తెలిసింది.
మరింత వెతికినప్పుడు, మార్చి 5, 2025న షేర్ చేసిన ఒక వార్తా నివేదిక మాకు లభించింది, అందులో మాణిక్గంజ్కు చెందిన యువ ఆవిష్కర్త జుల్హాస్ మొల్లా స్వయంగా నిర్మించిన విమానాన్ని విజయవంతంగా నడపడం ద్వారా ప్రజలను ఆశ్చర్యపరిచాడు. మంగళవారం (మార్చి 4) ఉదయం 10:00 గంటలకు, అతను తన విమానంలో ఎగరడం చూడొచ్చు. ఇది అతని సంవత్సరాల కృషిలో ఒక మైలురాయిగా నిలిచింది.
ఒక ఇంటర్వ్యూలో, జుల్హాస్ మాట్లాడుతూ “ఈ విమానాన్ని నిర్మించడానికి మూడు సంవత్సరాల పరిశోధన, మరో సంవత్సరం నిర్మాణానికి పట్టింది. మొత్తం ఖర్చు దాదాపు 8 లక్షల టాకా అయింది. ఈ నిర్మాణం అల్యూమినియం, ఇనుముతో జరిగింది, ఏడు హార్స్పవర్ వాటర్ పంప్ ఇంజిన్ దీనికి శక్తినిస్తుంది.” అని తెలిపాడు. ఈ విమానం వాణిజ్య ఉపయోగం కోసం కాకుండా ప్రయోగాత్మక, శిక్షణ ప్రయోజనాల కోసం రూపొందించినట్లు తెలిపాడు. అయితే, ప్రభుత్వ నిధులు, మద్దతుతో మిగిలినది సాధ్యమవుతుందని నమ్ముతున్నానని తెలిపాడు. అతడు తయారు చేసిన విమానం దాదాపు 50 అడుగుల ఎత్తుకు చేరుకోగలదు.
డైలీ స్టార్‌లో ప్రచురితమైన మరో వార్తా కథనం ప్రకారం, జుల్హాస్ విమానం అతని టాలెంట్ కు నిదర్శనం. తక్కువ బడ్జెట్‌తో నిర్మించబడిన ఇది పెట్రోల్ లేదా ఆక్టేన్‌తో నడపగల గ్యాసోలిన్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ప్రతి 25 నుండి 30 కిలోమీటర్ల విమాన ప్రయాణానికి దాదాపు ఒక లీటరును వినియోగిస్తుంది. ఫాబ్రిక్‌తో కప్పబడిన రెక్కలు ఆకట్టుకునే 32 అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి, బాడీ 18 అడుగుల పొడవు ఉంటుంది.
విమానం గంటకు 45 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్ అవుతుంది. గాలిలో గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. ఇది ప్రధానంగా వాణిజ్య ఉపయోగం కోసం కాకుండా శిక్షణ కోసం రూపొందించారు. నిధులు, స్పాన్సర్‌షిప్‌తో, ఇలాంటి విమానాల భారీ ఉత్పత్తి సాధ్యమవుతుందని జుల్హాస్ నమ్మకంగా చెబుతున్నాడు.
కనుక, ఒక యువకుడు విమానంలో ప్రయాణిస్తున్నట్లు చూపిస్తున్న వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. ఇది బంగ్లాదేశ్ కు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు కేవలం ఒక వారంలోనే స్క్రాప్ మెటీరియల్స్‌తో విమానాన్ని తయారు చేశారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story

