Thu Jun 12 2025 19:55:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వీధిలో పడుకున్న వ్యక్తిని సింహం వాసన చూసి వెళ్ళిపోతున్నట్లు చూపుతున్న వీడియో ఏఐ తో తయారు చేసింది
ఇటీవల, భారతదేశంలో ఆసియా సింహాల సంఖ్య పెరిగింది. ఇది వన్యప్రాణుల సంరక్షణలో ఒక పెద్ద విజయాన్ని సూచిస్తుంది. గుజరాత్లో

Claim :
భారతదేశంలోని ఒక వీధిలో పడుకున్న వ్యక్తిని సింహం వాసన చూసి వెళ్ళిపోతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తోందిFact :
వైరల్ వీడియో ఏఐ జెనరేటెడ్ వీడియో, నిజం కాదు
ఇటీవల, భారతదేశంలో ఆసియా సింహాల సంఖ్య పెరిగింది. ఇది వన్యప్రాణుల సంరక్షణలో ఒక పెద్ద విజయాన్ని సూచిస్తుంది. గుజరాత్‌లోని గిర్ అడవులలో తాజా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2020లో 674 ఉండగా.. 2025 నాటికి 891కి పెరిగింది. గుజరాత్‌లోని 891 సింహాలలో 56% మాత్రమే అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. 507 వరకు రెవెన్యూ ప్రాంతాలు, ఆవాస ప్రాంతాల వెలుపల సింహాల కారిడార్లలో నివసిస్తున్నాయి. మిగిలిన సింహాలు అటవీయేతర ప్రాంతాలు, మానవ నివాసాలకు దగ్గరగా ఉన్నాయి. సింహాల వంటి మాంసాహార జంతులు ఇలా ఉండడం వాటికి కూడా ప్రమాదకరమే. సింహాలు విద్యుదాఘాతం కారణంగా కూడా చనిపోయాయి. మనుషులు ఆత్మరక్షణ కోసం మృగాలను చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సింహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ఇది జంతువులకు, మానవులకు సమస్యలను సృష్టిస్తుంది.
ఒక వీడియోలో సింహం వీధిలో నడుస్తూ, రోడ్డుపై నిద్రిస్తున్న వ్యక్తిని వాసన చూసి, వెళ్లిపోతున్నట్లు ఉంది. అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను వివిధ శీర్షికలతో పంచుకున్నారు, దీనిని ఒక అద్భుతం అని పిలిచారు. కొందరు సింహం నిద్రిస్తున్న వ్యక్తిపై ఎందుకు దాడి చేయలేదో తెలియడం లేదని ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన భారతదేశంలో జరిగిందని పేర్కొంటూ చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేశారు. A chilling moment caught on camera — a man sleeping on a footpath in India narrowly escapes a lion attack. The lion walks up to him, sniffs... అంటూ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టు చేశారు.
Dangerous Video : Night Street Tiger #tiger #night #dangerous #street అంటూ యూట్యూబ్ లో మరో యూజర్ పోస్ట్ పెట్టారు.
"भारत में सड़क पर सो रहा एक व्यक्ति शेर का शिकार होने से बच गया, जब शेर उसके पास आया, उसे सूंघा और फिर वहां से चला गया।" बेशक! जब तक ज़िंदगी लिखी है, कोई कुछ नहीं बिगाड़ सकता...!! హిందీ భాషలో కూడా పోస్టులు వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తికి ఇంకా భూమిపై నూకలు ఉన్నాయని పోస్టుల్లో చెప్పారు.
వైరల్ అవుతున్న పోస్టుల ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వైరల్ వీడియో నిజమైన సంఘటనకు సంబంధించింది కాదు. ఇది AI-జనరేటెడ్ వీడియో. వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, వీడియోలో కొన్ని తప్పులను కనుగొన్నాము. సైన్ బోర్డులు అసహజంగా ఉన్నాయి. సింహం అడుగు పెట్టినప్పుడు పరుపు మీద ఎటువంటి తేడాలు కనిపించలేదు. నిద్రపోతున్న వ్యక్తి కాళ్ళు అసాధారణంగా కనిపిస్తాయి.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, IFS అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము, “సింహం మనిషి వాసన చూస్తున్నట్లు చూపించే ఈ వీడియో దాదాపు 7 మిలియన్ల వీక్షణలను కలిగి ఉంది. ఇది AI-జనరేటెడ్ వీడియో. ప్రజలను గందరగోళపరిచేందుకు AIని ఎలా ఉపయోగించవచ్చో చూడొచ్చు. AI ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఊహించుకోండి !!” అని తెలిపారు.
మరింత శోధించినప్పుడు, @Theworldofbeasts అనే YouTube ఛానెల్ ద్వారా షేర్ చేసిన ఒక చిన్న వీడియో మాకు కనిపించింది, అక్కడ వైరల్ వీడియో జూన్ 6, 2025న “Leão encontra homem dormindo na rua em Gujarat!!!” అనే శీర్షికతో పోస్ట్ చేశారు. అనువదించినప్పుడు “సింహం గుజరాత్‌లోని వీధిలో నిద్రిస్తున్న వ్యక్తిని చూడొచ్చు!! వీడియో వివరణలో వీడియోలో సింథటిక్ లేదా ఎడిట్ చేసిన మీడియా ఉందని కూడా పేర్కొంది. ధ్వని లేదా దృశ్యాలు ఎడిట్ చేశారు లేదా డిజిటల్‌గా రూపొందించారు.“ అని ఉండడం చూడొచ్చు.
ఈ ఛానెల్లోని ఇతర వీడియోలను మేము పరిశీలించగా, అనేక ఇతర AI జనరేటెడ్ వీడియోలు ఇందులో అప్లోడ్ చేశారని తెలుసుకున్నాం. కొన్ని వీడియోల లింక్‌లు ఇక్కడ ఉన్నాయి.
యూట్యూబ్ ఛానల్ బయోలో వీడియోలు AI టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్లుగా పేర్కొన్నారు.
కాబట్టి, AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఒక వీడియోను భారతదేశంలో జరిగిన ఘటనగా ప్రచారం చేస్తున్నారు. వీధిలో నడుస్తున్న సింహం రోడ్డుపై నిద్రిస్తున్న వ్యక్తి వాసన చూసి, అతనికి హాని చేయకుండా వెళ్లిపోయే నిజమైన సంఘటనగా వైరల్‌గా షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో AI-జనరేటెడ్ వీడియో అని స్పష్టంగా తెలుస్తోంది.
Claim : భారతదేశంలోని ఒక వీధిలో పడుకున్న వ్యక్తిని సింహం వాసన చూసి వెళ్ళిపోతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story