Fri Dec 05 2025 07:16:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ‘ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహం’ అంటూ వైరల్ అవుతున్న వీడియో నిజం కాదు, ఏఐ తో చేసింది
వినాయక చతుర్థిని దేశ విదేశాల్లోని హిందువులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. యునైటెడ్ స్టేట్స్‌లోని పలు ప్రాంతాల్లో కూడా

Claim :
చెన్నైలో ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి విగ్రహాన్ని నిర్మించారుFact :
ఈ వీడియో నిజమినది కాదు, ఆఈ తో రూపొందించారు
వినాయక చతుర్థిని దేశ విదేశాల్లోని హిందువులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. యునైటెడ్ స్టేట్స్‌లోని పలు ప్రాంతాల్లో కూడా నిర్వహించారు. ఈ పండుగ ఆగస్టు 27, 2025న ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైంది. సృష్టి, లయ చక్రాన్ని సూచించే గణేష్ నిమార్జన్తో ఈ వేడుకలు ముగుస్తాయి. నగరాల్లోని చేతివృత్తుల వారికి కూడా ఎంతో పని ఉంటుంది. ఇళ్లకు సాధారణ మట్టి విగ్రహాల నుండి, భారీ బొమ్మల వరకు అందమైన గణేష్ విగ్రహాలను రూపొందించారు. ఇళ్ల లోపల, గణేశుడిని స్వాగతించడానికి చిన్న మందిరాలు నిర్వహించారు కూడానూ!! పలు కమ్యూనిటీలలో రోజువారీ ప్రార్థనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం భక్తులను ఒకచోట చేర్చే పలు కార్యక్రమాలను చేపట్టాయి. 2025 సంవత్సరానికి సంబంధించి 69 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని "విశ్వశాంతి మహాశక్తి గణపతి" అనే ఇతివృత్తంతో ఆవిష్కరించారు.
ఇంతలో, ప్రపంచంలోనే ఎత్తైన వినాయకుడిని చెన్నైలో ఏర్పాటు చేశారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. సర్క్యులేషన్లో ఉన్న వీడియో AI ద్వారా రూపొందించారు.
వీడియోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, వైరల్ వీడియోలో HooHooCreations80 అనే వాటర్‌మార్క్‌ను గమనించాం. ఇన్స్టాగ్రామ్ ఖాతా తనిఖీ చేసినప్పుడు, వైరల్ వీడియో ఆగస్టు 23, 2025న ‘గణేష్ చతుర్థి స్పెషల్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు మాకు తెలిసింది. వీడియోలోని వ్యక్తుల కదలికల్లో తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. రియాలిటీకి చాలా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఖాతాలో ప్రచురించబడిన ఇతర వీడియోలను, బయోను కూడా తనిఖీ చేసినప్పుడు, ఖాతాలోని వీడియోలను AI టెక్నాలజీని ఉపయోగించి సృష్టించిన అనేక ఇతర వీడియోలను కనుగొన్నాము.
HooHoocreations80 రూపొందించిన మరో వీడియో గురించి NDTV కథనంలో ఉంది. ఈ వీడియో అదే Instagram ఖాతాలో కూడా షేర్ చేశారు.
మేము HooHooCreations80 యూట్యూబ్ ఛానెల్‌ని కూడా శోధించగా, వారి బయోలో- ఇది ప్రత్యేకమైన AI-ఆధారిత వినోదానికి నిలయమని పేర్కొంది. ఈ ఛానెల్ మిమ్మల్ని నవ్వించడానికి, సంతోషంగా ఉండటానికి రూపొందించిన ఆహ్లాదకరమైన, వినోదాత్మక AI వీడియోలను సృష్టిస్తుందని తెలిపింది. బయోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన అనేక ఇతర వీడియోలను యూట్యూబ్ పేజీలో అప్లోడ్ చేసినట్లుగా కూడా మేము కనుగొన్నాము.
AI ఉపయోగించి రూపొందించారో లేదో తెలుసుకోవడానికి మేము wasitAI సాధనాన్ని ఉపయోగించి వీడియోను తనిఖీ చేసాము, ఆ వీడియో AI ద్వారా రూపొందించినట్లుగా తెలిసింది. ఇక్కడ స్క్రీన్‌షాట్ ను చూడొచ్చు.
కనుక, గణపతి విగ్రహ నిర్మాణాన్ని చూపించే వైరల్ వీడియో AI ద్వారా రూపొందించారు. ఇది చెన్నైలోని ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి విగ్రహాన్ని చూపిస్తుందనే వాదన నిజం కాదు .
Claim : చెన్నైలో ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి విగ్రహాన్ని నిర్మించారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

