Sat Dec 06 2025 00:08:27 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రోడ్డుపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు వ్యక్తి మీద ట్యాంకర్ తో నీటిని కొట్టిన ఘటన ఇండోర్‌లో జరుగలేదు
ఇండోర్ వరుసగా ఎనిమిది సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో అగ్రస్థానంలో నిలిచి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా

Claim :
రోడ్డుపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు శిక్షగా ఒక వ్యక్తి మీద ట్యాంకర్ తో నీటిని కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుందిFact :
ఈ వీడియో పెరూకు సంబంధించింది, భారతదేశం లేదా ఇండోర్ నగరానికి ఎలాంటి సంబంధం లేదు
ఇండోర్ వరుసగా ఎనిమిది సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో అగ్రస్థానంలో నిలిచి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవతరించింది. ఇండోర్ అసాధారణమైన పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది. గత ఏడు సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా స్థిరంగా ర్యాంక్ సాధిస్తూ ఉంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులను ప్రదానం చేశారు.
ఇండోర్ నగరం సమగ్ర వ్యర్థ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. ఇందులో ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాలను వేరు చేయడం, రీసైక్లింగ్, కంపోస్టింగ్‌పై దృష్టి సారించింది. నివాసితులు పరిశుభ్రతను కాపాడుకోవడంలో భాగమయ్యేలా, ప్రోత్సహించడానికి ఇండోర్ ప్రజా అవగాహన కార్యక్రమాలను అమలు చేసింది. ఇండోర్ లో చెత్తను పర్యవేక్షించడానికి CCTV కెమెరాలు, నీటి సేకరణకు సంబంధించిన యూనిట్లను డిజిటల్ గా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ విజయానికి స్థానిక పరిపాలన, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో చురుకుగా వ్యవహరించే నివాసితుల మధ్య బలమైన భాగస్వామ్యం కూడా కారణమని చెప్పవచ్చు. ఇండోర్ లో పలు ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారం కోసం మార్పిడి చేసుకోవచ్చు, దీంతో వ్యర్థాల తగ్గింపు కీలకంగా మారింది.
వీధిలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించినందుకు శిక్షగా ఒక వ్యక్తిపై వాటర్ ట్యాంకర్ తో నీళ్లు పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హిందీ, ఇంగ్లీషులో క్యాప్షన్లతో వైరల్ అవుతూ ఉంది. "అందుకే ఇండోర్ నంబర్ 1 స్థానంలో ఉంది. జహాన్ వార్నింగ్ నహీ, డైరెక్ట్ వాషింగ్ హోతీ హై!" అంటూ పోస్టులు పెట్టారు.
“इसीलिए इंदौर हमेशा सफाई में नंबर 1 रहता है” అంటూ హిందీలో కూడా పోస్టులు పెట్టారు.
“इंदौर की स्वच्छता में इंदौर नगर निगम का योगदान सराहनीय है। यहां कही भी मूतने वालो को सही सबक सिखाया जाता है।“ మరికొందరు పోస్టులు పెట్టారు
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వాటిని శోధించినప్పుడు, ఫేస్బుక్ పేజీలో
“¡Increíble! Un hombre fue sorprendido orinando en la vía pública y terminó siendo rociado con agua de cisterna como consecuencia. ¿Qué opinas de este tipo de sanciones? అంటూ ప్రచురించిన వీడియో స్పానిష్‌లో అప్లోడ్ చేశారని తెలుసుకున్నాం. "అద్భుతం! ఒక వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ పట్టుబడ్డాడు. దాని ఫలితంగా అతనిపై నీరు పోశారు." అంటూ చెప్పుకొచ్చారు.
Enfoco tv అనే మరో ఫేస్బుక్ పేజీ కూడా మార్చి 15, 2025న ఈ వీడియోను “#INCREIBLE | LO #SORPENDEN #ORINANDO EN LA CALLE Y ES #MOJADO
Un hombre fue sorprendido orinando en la calle y camión aguatero lo mojó para darle una lección.La particular escena ocurrió cuando un hombre orinaba en las afueras del tren eléctrico de Lima. El aguatero no tuvo mejor idea que empaparlo en agua para que no continue ensuciando las calles. La escena ha generado diversas reacciones en redes, donde muchos lo ven como una lección para quienes ensucian la vía pública.” అనే శీర్షికతో షేర్ చేశారు.
అనువదించగా "ఒక వ్యక్తి వీధిలో మూత్ర విసర్జన చేస్తూ పట్టుబడ్డాడు. అతనికి గుణపాఠం చెప్పడానికి ఒక నీటి ట్రక్ అతన్ని నీటితో తడిపింది. లిమా ఎలక్ట్రిక్ రైలు వెలుపల ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసినప్పుడు ఆ ఘటన జరిగింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది." అంటూ పోస్టులు పెట్టారు.
పెరూలోని లా విక్టోరియాలో ఈ సంఘటన జరిగిందని పేర్కొంటూ రేడియో కాంటాక్టో సుర్ - నోటిసియాస్ షేర్ చేసిన మరో ఫేస్బుక్ వీడియోను కూడా మేము తెలుసుకున్నాం.
larepublica.pe ప్రచురించిన నివేదిక ప్రకారం, వైరల్ క్లిప్‌లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ వాహనం ఆ వ్యక్తిని పూర్తిగా తడిపివేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి త్వరగా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ చివరికి మరింత తడిసిపోవడం ఫుటేజ్ లో చూడొచ్చు. ఈ సంఘటన పెరూలో జరిగిందని నివేదిక తేల్చింది.
కనుక, వీధిలో మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిపై వాటర్ ట్యాంకర్ తో నీళ్లు పోస్తున్న వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు. ఈ వీడియో పెరూలోని లా విక్టోరియా లో జరిగింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : రోడ్డుపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు శిక్షగా ఒక వ్యక్తి మీద ట్యాంకర్ తో నీటిని కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story

