ఫ్యాక్ట్ చెక్: ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ పథకం అమలు తర్వాత బస్సు ఆగలేదని ప్రచారం తప్పుదారి పట్టిస్తోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు

Claim :
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్ ప్రయాణానికి ‘స్త్రీ శక్తి’ పథకం అమలు ఉన్నా, ఆర్టీసీ బస్సు మహిళా విద్యార్థులను ఎక్కించకుండానే వెళ్లిపోతోందిFact :
ఆ వీడియో పాతది. ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్‌లో 2025 ఆగస్టు 15 నుంచి మాత్రమే ప్రారంభమైంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్ ప్రయాణం అవకాశం కల్పించబడింది. అమరావతిలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురూ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) బస్సులలోని ఐదు విభాగాల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. వీటిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. సుమారు 2.62 కోట్ల ఆంధ్ర మహిళలకు ఈ పథకం లబ్ధి చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 11,449 APSRTC బస్సులు ఉన్నాయి. వీటిలో 74 శాతం బస్సులు అమ్మాయిలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించే విధంగా ‘స్త్రీ శక్తి’ పథకం కింద అందుబాటులోకి రానున్నాయి.
ఇంతలో, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక బస్సు సరైన రీతిలో బస్ స్టాప్ వద్ద ఆగకపోవడంతో విద్యార్థులు ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు. ఆపై బస్సు మహిళా విద్యార్థులను ఎక్కించకుండానే వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోకి జత చేసిన శీర్షికలో తెలుగులో ఇలా వ్రాశారు “మహిళలకు బస్సు ఫ్రీ.. అయితే బస్సు ఎక్కే అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటారు. #FreeBus #Eluru #AndhraPradesh #UANow”.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ సర్వీస్ ప్రారంభమైన తర్వాతది కాదు.
వీడియో నుండి కీ ఫ్రేమ్‌లు తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. దాంతో ఈ వీడియోను 2025 జూలై 25న Eluru_official అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసినట్లు తెలిసింది. ఆ వీడియో క్యాప్షన్ ఇలా ఉంది “APSRTC తక్షణ చర్య తీసుకుని, కాలేజ్ స్టాప్ వద్ద బస్సులు ఆగేలా చూడాలి. ప్రతి విద్యార్థికి సురక్షితంగా కాలేజీకి వెళ్లే హక్కు ఉంది. ఎలూరు ప్రాంతీయ డిపోలు బస్సులు సర్.సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆగేలా చర్యలు తీసుకోవాలి.” ఆ వీడియోలో కనిపించే టెక్స్ట్ కూడా “Serious Safety issue for students, Everyday, students are struggling as the bus doesn’t stop at CRR college” అని ఉంది.
అధికారిక APSRTC ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఈ పోస్ట్‌పై స్పందించి, బస్సులు కాలేజీ వద్ద ఆగేలా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలూరు, కృష్ణా, సమీప డిపో మేనేజర్లకు RTC అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. కాలేజీ వద్ద బస్సులు ఆగాలి అంటు సిబ్బంది, ప్రయాణికులకు తెలియజేయడానికి నోటీస్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని RTC హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం కూడా ఈ వీడియో ను తప్పుడు క్యాప్షన్ తో షేర్ చేస్తున్నారని స్పష్టం చేసింది. కొంతమంది ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ పథకం పై అపవాదు కలిగించే ఉద్దేశ్యంతో పాత వీడియోను వాడుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని ప్రతి మహిళకు RTC బస్సులు అందుబాటులో ఉన్నాయని, తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం, 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ‘స్త్రీ శక్తి’ పథకం అమలు మొదటి రోజే ఘన విజయాన్ని సాధించింది. ప్రారంభం అయిన 30 గంటల్లోనే 12 లక్షలకుపైగా మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేశారు.
వైరల్ అవుతున్న ఆర్టీసీ బస్సు వీడియో కొత్తది కాదు. ఇది 2025 జూలై 25న ఎలూరు ప్రాంతంలోని ఒక కాలేజీ వద్ద చోటుచేసుకున్న సమస్యకు సంబంధించినది. ఈ వీడియోకి ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ స్కీమ్‌తో ఎటువంటి సంబంధం లేదు. కనుక, ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తొంది

