ఫ్యాక్ట్ చెక్: రవీనా టాండన్ ఆర్జేడీ తరఫున బీహార్ ఎన్నికల లో ప్రచారం చేస్తున్నారనేది నిజం కాదు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక ఆన్లైన్ లోనూ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. సోషల్ మీడియాలో తప్పుదారి

Claim :
బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తో కలిసి బీహార్ ఎన్నికల కోసం ఆయన తరపున ప్రచారం చేస్తానని చెబుతున్న వీడియో.Fact :
ఈ వీడియో పాతది. ప్రస్తుత బీహార్ ఎన్నికలకు సంబంధించినది కాదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక ఆన్లైన్ లోనూ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే కథనాలకు నిలయంగా మారింది. వేరే సమయంలో తీసిన వీడియోలు, చిత్రాలతో ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనలు అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాదనల్లో భాగంగా RJD నాయకుడు తేజస్వి యాదవ్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కలిసి ఉన్న వీడియో ఉంది.
ఫ్యాక్ట్ చెక్:
వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రవీనా టాండన్ తేజస్వి యాదవ్ తరపున ప్రచారం చేస్తారని తెలుసుకోడానికి మేము Googleలో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఏవైనా విశ్వసనీయ వార్తా నివేదికలు, అధికారిక సోషల్ మీడియా ప్రకటనల్లో వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించాం. ఇందుకు సంబంధించి సరైన ఫలితాలను ఇవ్వలేదు. తేజస్వి యాదవ్, రవీనా టాండన్ లకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, అటువంటి ప్రకటన ఏదైనా చేసి ఉంటే, ప్రధాన స్రవంతి మీడియాలో గణనీయమైన కవరేజీని పొందేది. రవీనా టాండన్, తేజస్వి యాదవ్ ఇద్దరి ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లను కూడా మేము సమీక్షించాము. వారిద్దరూ ఎలాంటి రాజకీయ ప్రకటనలకు సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేయలేదు.
రవీనా టాండన్‌కు రాజకీయాల్లో చేరడానికి భవిష్యత్తులో ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా, లేదా అని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, వైరల్ పోస్టులకు మద్దతు ఇవ్వడానికి మాకు ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు దొరకలేదు.

