ఫ్యాక్ట్ చెక్: బాకులో పాకిస్తాన్ విజయోత్సవ వేడుకలంటూ వైరల్ అవుతున్న వీడియో - పాతది
పాకిస్తాన్ (Pakistan), భారతదేశాల (India) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26

Claim :
భారతదేశంపై పాకిస్తాన్ విజయం సాధించిన తరువాత అజర్బైజాన్లోని బాకు వీధుల్లో జరుపుకున్న సంబరాలను వైరల్ వీడియో చూపిస్తోందిFact :
2020 నాటి పాత వీడియో, అజర్బైజాన్ అర్మేనియాపై విజయం సాధించినందుకు పాకిస్తానీ విద్యార్థులు జరుపుకుంటున్న వేడుకను చూపిస్తోంది
పాకిస్తాన్ (Pakistan), భారతదేశాల (India) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించినందుకు ప్రతీకారంగా భారతదేశం మే 7, 2025న "ఆపరేషన్ సింధూర్"ను ప్రారంభించింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఖచ్చితమైన దాడుల్లో 100 మందికి పైగా పేరుమోసిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల తరువాత, పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను పంపడం ద్వారా భారతదేశాన్ని రెచ్చగొట్టింది. సరిహద్దు ప్రాంతాల దగ్గర భారీ దాడులను తిప్పి కొడుతూ, భారతదేశం కనీసం నాలుగు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపైన ప్రతీకార దాడులు చేసింది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దాదాపు మూడు రోజుల తరువాత, శనివారం, మే 10న, భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. విలేకరులతో మాట్లాడుతూ, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మే 10, 2025న మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తన భారతీయ డీజీఎంఓతో సంప్రదించినట్టు చెప్పారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై భారత్, పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చలను ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ - డీజీఎంఓలు జరుపనున్నారు. ఇరు దేశాల మధ్య హాట్లైన్లో చర్చించనున్నారు. 48 గంటల పాటు కాల్పుల విరమణ, కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి.
అయితే, కొన్ని పాకిస్తానీ సోషల్ మీడియా యూజర్లు పాకిస్తాన్ విజయం సాధించింది అంటూ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. అల్లంటి చర్యలలో భాగం గానే, ఒక వీధి మధ్యలో పెద్ద గుంపు వేడుకలు జరుపుకుంటున్న వీడియో అజర్బైజాన్లో ప్రజలు పాకిస్తాన్ విజయాన్ని జరుపుకున్నారనే వాదనతో ప్రచారంలో ఉంది. వీడియోలో, గుంపు నిరంతరం పాకిస్తాన్ అని నినాదాలు చేస్తున్నట్లు మనం వినవచ్చు.
ఈ వీడియోను “Celebration in the streets of Baku Azerbaijan as PAK declared victory over India #IndiaPakistanWar #IndianArmy #PakistanArmy #CeaseFire” అని షేర్ చేసారు. అనువదించగా "పాకిస్తాన్ భారతదేశంపై విజయం ప్రకటించడంతో బాకు అజర్బైజాన్ వీధుల్లో సంబరాలు #IndiaPakistanWar #IndianArmy #PakistanArmy #CeaseFire” అనే క్యాప్షన్ తో షేర్ చేస్తున్నారు.
క్లెయిమ్ ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో పాతది. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్లను సేకరించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వాటిని శోధించినప్పుడు, ఆ వీడియోను 2020 సంవత్సరంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారని మాకు తెలిసింది.
"PAKISTAN" Crowd chants praise for Pakistan as people of Azerbaijan celebrate their glorious victory and Armenia's defeat #NagornoKarabakh #Azərbaycan #PakistanZindabad” అనే క్యాప్షన్ తో నవంబర్ 11, 2020న షేర్ చేసారు. అనువదించగా, "అజర్బైజాన్ ప్రజలు తమ ఘన విజయం తరువాత "పాకిస్తాన్" అంటూ అక్కడి ప్రజలు పాకిస్తాన్ను ప్రశంసిస్తూ నినాదాలు చేసారు. #NagornoKarabakh #Azərbaycan #PakistanZindabad" అని పేర్కొన్నారు.
అదే వీడియోను నవంబర్ 8, 2020న మరొక X వినియోగదారుడు షేర్ చేశారు.
నవంబర్ 12, 2020న ఫేస్బుక్లో ప్రచురించిన వేడుకల దృశ్యాలను కూడా మాకు లభించాయి, దీనిలో అజర్బైజాన్లో ప్రజలు పాకిస్తాన్ జెండాలను పట్టుకుని, తమకు సహాయం చేసినందుకు పాకిస్తాన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అజర్బైజాన్, పాకిస్తాన్ సంవత్సరాలుగా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నప్పటికీ, ప్రచారంలో ఉన్న వీడియో భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాతది కాదు. ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది.