ఫ్యాక్ట్ చెక్: నేపాల్ నిరసనల వీడియోగా షేర్ అవుతున్నది సిక్కిం లో ప్రజలు మోడీకి స్వాగతం పలుకుతున్న వీడియో
సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్‌లో రాజకీయ అవినీతిపై పెద్ద పోరాటమే జరిగింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసనలు

Claim :
హింసాత్మక నిరసనల మధ్య భారత ప్రధాని మోదీకి మద్దతుగా నేపాల్ ప్రజలు వీధుల్లోకి వచ్చారని వైరల్ వీడియో చూపిస్తోందిFact :
2025 మేలో సిక్కిం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది.
సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్‌లో రాజకీయ అవినీతిపై పెద్ద పోరాటమే జరిగింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. స్థిరపడిన ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 9 న జరిగిన నిరసనలు ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలిని పదవీచ్యుతుని చేయడానికి దారితీశాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో ఇటీవలి సంక్షోభాలను గుర్తుకు తెస్తూ, అనేక మంది సీనియర్ మంత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అధికారిక నివాసాలను నిరసనకారులు తగలబెట్టారు. దోచుకున్నారు. ఈ హింసాత్మక నిరసనల సమయంలో 51 మంది మరణించారు.
ఇదిలా ఉండగా, భారత ప్రధాని మోదీ చిత్రంతో కూడిన బ్యానర్‌ను పట్టుకుని కొంతమంది ఊరేగింపుగా వెళ్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నేపాల్‌లో కూడా భారత ప్రధాని మోదీని అభిమానిస్తున్నారనే వాదనతో పోస్టులు పెట్టారు. “देखो चमचों मोदी नेपाल में भी छाया हुआ है‚ तुम लोग डूब कर मर क्यों नहीं जाते आहुल गांडी को साथ में लेकर के।“. అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెక్:
ఫేస్ బుక్ పేజీ లో ఉన్న వీడియో లోని స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.

